అనంతపురం అగ్రికల్చర్: ముంగారు పంటల సాగుకు వేళయింది. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు సోమవారం నుంచి అనుకూలమని అధికారులు, శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలు కొంచెం ఆలస్యమైనా జూలై ఆఖరు వరకు ఖరీఫ్ ఏరువాకకు మంచి అదనుగా తెలిపారు. ఇప్పుడు నడుస్తున్న మృగశిరతో పాటు ఈ నెల 22న ఆరుద్ర, ఆ తర్వాత వచ్చే పునర్వసు, పుష్యమి కార్తెల్లో పంటల సాగుకు అనుకూలమని చెబుతున్నారు. మూడు రోజులుగా చాలా మండలాల్లో మోస్తరుగా వర్షాలు పడడటంతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ ఖరీఫ్‌లో 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు.
విత్తుకు వేళయినా... అందని విత్తనం
ఈసారి జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా రాయితీ విత్తనం కేటాయించింది. 56 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ, మరో 2 వేల క్వింటాళ్లు కందులు, పెసలు, మినుములు, కొర్రలు, రాగులు కేటాయించింది. అయితే వేరుశనగ పంపిణీ ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలు పెట్టడంతో ఇప్పటికీ రైతులకు విత్తనం అందని పరిస్థితి నెలకొంది. సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా వేరుశనగ విత్తనం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే కందుల పరిస్థితి అలాగే ఉంది.
జూలై నెలాఖరు వరకు
పంటలు విత్తుకునేందుకు అదను
ఈ ఖరీఫ్‌లో 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా


