ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. విద్యా వ్యాపారాన్ని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాయమాటలతో విద్యార్థులు, తల్లిదండ్రులను వంచిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలల పేరుతో, భవనాలు నిర్మాణంలో ఉండగానే అడ్మిషన్లు చేస్తున్నారు. పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు.
– ఓతూరు పరమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ


