నాకు హంద్రీ– నీవా కాలువ సమీపాన ఐదు ఎకరాల పొలం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం మూడు ఎకరాల్లో చీనీ చెట్లు పెట్టా. రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. హంద్రీ–నీవా కాలువ గుండా మూడు నుంచి నాలుగు నెలల పాటు నీరు ప్రవహిస్తే భూగర్భ జలాలు బాగా పెరిగేవి. బోరు కేసింగ్ పైపు నుంచి నీరు ఉబికి వచ్చేది. కానీ హంద్రీ–నీవా కాలువకు సిమెంట్‌తో లైనింగ్ చేపట్టడంతో భూమిలోకి నీరు ఇంకలేదు. రెండు బోర్లలోనూ నీరు తగ్గిపోయింది. చీనీ చెట్లకు నీటి తడులు ఎలా అందించాలో దిక్కుతోచడం లేదు.
– కొల్లన్న ,రైతు, పి,నారాయణపురం,కూడేరు మండలం
ఇక పంటలు సాగు చేయలేం
హంద్రీ– నీవా కాలువకు కొంతదూరంలో నాకు పది ఎకరాల పొలం ఉంది. కాలువ గుండా నీరు ప్రవహిస్తుండడంతో రెండు బోర్లలో నీరు బాగా వచ్చేది. ధైర్యంగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసేవాడిని. కానీ కాలువకు సిమెంట్‌తో లైనింగ్ చేయడంతో బోర్లలో నీరు బాగా తగ్గిపోయింది. ఐదు ఎకరాల్లో వేరుశనగ, టమాట పంటలను సాగు చేశా. అరకొరగా వచ్చే నీరు పంటలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. భవిష్యత్‌లో నీటి కొరతతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
– పెద్ద అక్కులన్న, రైతు, ఎంఎంహళ్లి,
కూడేరు మండలం


