కరువు జిల్లా అనంతపురంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థపై సరైన నియంత్రణ లేకపోవడంతో అధిక ఫీజులు, విద్యార్థులు–తల్లిదండ్రులపై ఆర్థిక భారం ఆందోళనకరంగా మారింది. నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును లాభార్జనకు బలి చేయకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి.
– చంద్రశేఖర్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం


