అనంతపురం: చంద్రబాబు సారథ్యంలోని దగా పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ పాలన కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాబు పాలనపై ముద్రించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్‌రెడ్డితో కలిసి అనంత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత ’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, భూదందాలు, దౌర్జన్యాలు, అకృత్యాలే లక్ష్యంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం నగరంలో భూ కబ్జాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆస్తులను కాజేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ పరిశీలకులు నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హామీల అమలును విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వ ‘వెన్నుపోటు పాలన’కు నిరసనగా జూన్ 4వ తేదీ నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, ఎస్‌ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్ గౌడ్, గౌస్ బేగ్, మాజీ మేయర్ వసీం సలీం, సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, పూజారి రాజశేఖర్ యాదవ్, వీర రామకృష్ణారెడ్డి, సాకే చంద్రశేఖర్, బోయ కృష్ణమూర్తి, చింతకుంట మధు, ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, ఎల్లుట్ల మారుతీనాయుడు, గువ్వల రాజేష్‌రెడ్డి, పెన్నోబులేసు, చామలూరు రాజగోపాల్, ఎగ్గుల శ్రీనివాసులు, ఫయాజ్, కోన రాజారెడ్డి, మల్లెమీద నరసింహులు, కాగజ్‌ఘర్ రిజ్వాన్, మొఘల్ సైఫుల్లా బేగ్, లింగాల రమేష్, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, కొర్రపాడు హుస్సేన్‌పీరా, అనిల్‌కుమార్ గౌడ్, లక్ష్మన్న, దాదా ఖలందర్, ఆసిఫ్, కమల్ భూషణ్, జావెద్, మల్లెల వేణుగోపాల్, శేఖర్ బాబు, అనిల్‌కుమార్‌రెడ్డి, మాలపాటి శ్రీనివాసులు, వెన్నపూస రామచంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రఫీ, హిదాయతుల్లా, రామకృష్ణ, బాల మారుతీ ప్రసాద్, శ్రీదేవి, కృష్ణవేణి, శివబాల, సాకే చంద్రలేఖ, జాహ్నవిరెడ్డి, భారతి, పార్వతి, దేవి, శోభారాణి, భానుమతి, సుహాసిని, హజరాంబీ, ఖమర్తాజ్, సుజాత, రాధ, కళావతి, పద్మ, వరలక్ష్మి, నాగమణి, లక్ష్మి, అంజలి, ఉష, పద్మావతి, దేవి, సుజాత, పాల్గొన్నారు.


