● మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్
గార్లదిన్నె/నార్పల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)– 2026 మాటున అర్హులైన ఓటర్లను తొలగిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం నార్పల మండలం దుగుమర్రి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం, బీఎల్‌ఏల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌ఎం మోహన్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఓటరు జాబితాల పరిశీలనలో బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓటు విలువైందేనన్నారు. బూత్ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలన్నారు. నియోజకవర్గంలో తాము ప్రజలకు అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేక కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు..
2029 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌ఎంమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువ నాయకుడు రుత్విక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఎన్నికలు మొదలైనట్లేనన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతుంటే వెంటనే స్పందించి, అర్హులైన ఓటర్లకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, శింగ నమల నియోజకవర్గ బీఎల్‌ఏల ఇన్‌చార్జ్ మంజునాథ్, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, మండల కన్వీనర్లు ఖాదర్ వలి, ఎల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పరంధామ రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు ఫణీంద్ర, నాగేశ్వర రావు, రామాంజనేయులు, ఆంజనేయులు, ప్రభుదాస్, శివశంకర్, వేదాంత మోహన్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


