జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘అనంత’ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘అనంత’ విద్యార్థుల ప్రతిభ

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు స్థానికంగానే చదువుకుని అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఓతూరి అబు సాజిద్‌ ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీలో 5,793వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1287వ ర్యాంకు సాధించగా, డి.ఫయాజ్‌ అహ్మద్‌ ఓబీసీ కేటగిరీలో 1421వ ర్యాంకు సాధించారు. జి.సుహాస్‌ 1951, బి.ప్రషిత 2,810, పునీత్‌ చౌదరి 3,765, మాలపాటి కీర్తి 5,534, రాజ్‌ నిఖిలేష్‌ 9,093 అఖిల భారత ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరవుతుండగా, అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు (ఐఐటీలు)లో ప్రవేశ అవకాశాలు లభిస్తాయి.

ఐఐటీల్లో సీట్లకు

అర్హత

సాధించిన పలువురు

విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement