కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లిలో బస్టాండ్‌లో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారెమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయం ముందు రోజూలాగానే శుభ్రం చేస్తున్న వ్యక్తికి ఆలయం గేటు లోపలికి తోసి ఉండడం కనిపించింది. వెంటనే పూజారికి సమాచారం ఇవ్వడంతో ఆయనతో పాటు గ్రామస్తులు వచ్చి పరిశీలించారు. వెండి నాగపడగ, గొడుగులు, ఇతర ఆభరణాలు, బంగారు తాళిబొట్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో ఏఎస్‌ఐ సంజీవులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 3 కేజీల వరకు వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు పోయి ఉండవచ్చని గ్రామస్తులు, ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
3 కేజీల వెండి, 3 తులాల
బంగారం అపహరణ


