గాలివానకు విరిగిన విద్యుత్‌ స్తంభాలు | - | Sakshi
Sakshi News home page

గాలివానకు విరిగిన విద్యుత్‌ స్తంభాలు

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

అనంతపురం టౌన్‌: గాలివాన బీభత్సం సృష్టించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేల కూలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ స్తంభాలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌శాఖకు దాదాపు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. గుత్తి, గుంతకల్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 11కేవీతో పాటు ఎల్‌టీ విద్యుత్‌ స్తంభాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే అనంతపురం నగరంతో పాటు రూరల్‌ ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున విద్యుత్‌ స్తంభాలు నేలకు ఒరిగిపోయాయి. దాదాపు 220కి పైగా స్తంభాలు కూలిపోయినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం కురిసిన గాలి వానకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు తీగలు తెగిపోయాయి.

విద్యుత్‌శాఖకు రూ.12 లక్షల నష్టం

Advertisement
 
Advertisement
Advertisement