ఏపీఎల్‌ టోర్నీ కోచ్‌లుగా జిల్లా వాసులు | - | Sakshi
Sakshi News home page

ఏపీఎల్‌ టోర్నీ కోచ్‌లుగా జిల్లా వాసులు

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

అనంతపురం: వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంఽధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు ఫ్రాంచేజీ జట్లకు కోచ్‌లుగా జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. కాకినాడ కింగ్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఎల్‌ఎన్‌ ప్రసాదరెడ్డి, విజయవాడ సన్‌షైన్స్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా గులామ్‌ ఖాదిర్‌ బాషా నియమితులయ్యారు. అలాగే అమరావతి రాయల్స్‌ జట్టు ఫిజియోగా జిల్లాకు చెందిన కె.అశోక్‌కు అవకాశం దక్కింది. కాగా, రంజీ ప్లేయర్‌గా రాణించిన ఎల్‌ఎన్‌ ప్రసాదరెడ్డి 53 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్‌ కోచ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది కాకినాడ కింగ్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది కూడా అదే జట్టుకు ఆయనకు అవకాశం దక్కడం గమనార్హం. ఇక గులామ్‌ ఖాదిర్‌బాషా రాష్ట్ర స్థాయి జూనియర్‌, సీనియర్‌ జట్లలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆంధ్రా రంజీ సీనియర్‌, జూనియర్‌ జట్లకు ఫిజియోగా అశోక్‌ పనిచేశారు.

ప్రసాదరెడ్డి, గులామ్‌ ఖాదిర్‌బాషా, అశోక్‌ (ఫిజియో)

Advertisement
 
Advertisement
Advertisement