భక్తిశ్రద్ధలతో
బక్రీద్
రైతులన్నా, వ్యవసాయమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దగా గిట్టడం లేదు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. మూడు రోజుల్లో ఐదో సీజన్ కూడా మొదలుకానున్నా పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా దాటవేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అకాల వర్షాలు లేదంటే అధిక వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వాన ఇలా ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీరని గాయం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం చేస్తుండటంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది.
బక్రీద్‌ను గురువారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో హాజీలు, మౌలానాలు ఖుద్బా చేశారు. ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఇమామ్‌లు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. చిన్నారులు, పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
బక్రీద్ సందర్భంగా దువా చేస్తున్న చిన్నారులు
నేడు 74 ఉడేగోళానికి
ఇన్‌చార్జ్ కలెక్టర్
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి శుక్రవారం ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ విచ్చేయనున్నట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కారాల్యయ ఆవరణంలో జరిగే ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. పొలాలు, శ్మశాన వాటికలు, బ్రిడ్జిల పక్కన ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చిత్రావతి నదిలో నీళ్లు పూర్తిగా తగ్గిపోతుండడంతో అక్రమార్కులు ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా పట్టణంలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో పాటు పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ కొందరు టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నాలుగు రోజులుగా రాయలవారిపల్లి, ఎనుములపల్లి సమీపంలోని చిత్రావతిలో హిటాచీలు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు పాలనలో వర్షాలు గతి తప్పాయి. అకాలంలో అధిక వర్షాలు కురవడం, పంట దిగుబడులు అరకొరగా రావడం, వచ్చిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకపోవడం వల్ల వ్యవసాయం భారంగా పరిణమించింది. పంట నష్టం భారీగా జరిగినా పరిహారం ఇవ్వడానికి వెనుకాడుతుండటం రైతులను కలచివేస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో గత నాలుగు సీజన్లలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుశనగతో పాటు అరటి, మామిడి, చీనీ, టమాట, ఇతర కూరగాయల పంటలు వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 2024 ఖరీఫ్‌లో ఏడు, రబీలో ఏడు మండలాలను కరువు జాబితాలో చేర్చినా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● ఈ సీజన్‌కు సంబంధించి మార్చి 19, 23, మే 1, 7, 22, 27 తేదీల్లో ఈదురుగాలుల బీభత్సానికి రూ.15 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. రెండేళ్లలో రూ.1,000 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల మేరకు రూ.120 కోట్లకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా అధికారులు పలు దఫాలుగా ప్రతిపాదనలు పంపారు. ప్రకృతి కన్నెర్రకు పంటలు దెబ్బతిని తీరని నష్టం వాటిల్లుతున్నా చంద్రబాబు సర్కారు కరుణ చూపకపోవడం గమనార్హం.
జగన్ హయాంలో రూ.380 కోట్ల ఇన్‌పుట్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 2019–2024 మధ్య కాలంలో మొదటి నాలుగేళ్లూ విస్తారంగా వర్షాలు కురిశాయి. మధ్య మధ్యలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, చివరి ఏడాది 2023లో ఎల్–నినో కారణంగా వర్షాలు తక్కువై పంటలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏ సీజన్‌లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్ ముగిసేలోపు పెట్టుబడి రాయితీ పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.380.20 కోట్లు అందించారు. వ్యవసాయ పంటలకు సంబంధించి 2,65,290 మంది రైతులకు రూ.364.85 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి 8,997 మంది రైతులకు రూ.15.35 కోట్లు జమ చేశారు. వీటికి తోడుగా ఇన్సూరెన్స్, రైతు భరోసా, సున్నావడ్డీ కింద పెద్ద మొత్తంలో సాయం చేస్తూ రావడంతో వ్యవసాయం ఇబ్బంది లేకుండా సాగిపోయిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
పంట నష్ట ఉపశమనం ఇలా..
ఆగస్టు 2024 నుంచి అమలులోకి వచ్చిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) ప్రకారం ఎన్ని హెక్టార్లు దెబ్బతిన్నా కేవలం రెండు హెక్టార్లకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తారు. వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం ఖరారు చేశారు. అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్‌ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్బూజా, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేసి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈనెల 23న అనంతపురం రూరల్ మండలం కామారుపల్లిలో గాలులకు నేలవాలిన అరటి తోట, 27న బెళుగుప్ప మండలంలో పడిపోయిన బీర పందిర్లు
రైతులతో చంద్రబాబు సర్కారు పరిహాసం
నాలుగు సీజన్లు ముగిసినా
రూపాయి అందించని వైనం
రూ.120 కోట్ల మేర
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దగా
వైఎస్ జగన్ హయాంలో సీజన్ ముగిసేలోపు నష్ట పరిహారం
ఐదేళ్లలో జిల్లా రైతులకు
రూ.380 కోట్లకు పైగా అందజేత


