● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గోపినాథ్
తాడిపత్రి టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబిత పునః పరిశీలన ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామాల్లో ఏ ఒక్క ఓటరూ మిస్ కాకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గోపినాథ్ సూచించారు. ‘సర్’పై గురువారం పెద్దపప్పూరు, యాడికి మండలాలకు చెందిన పార్టీ బీఎల్‌ఓలకు తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మారిన ఓటరు వివరాల అప్‌డేట్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై నిఘా ఉంచాలన్నారు. ఇంటింటీ పరిశీలన పక్కాగా చేపట్టాలన్నారు. పక్క రాష్ట్రల్లో ఓట్ల తొలగింపు కారణంగా ఎన్నికల ఫలితాలు ఎలా తారుమారయ్యాయో వివరించారు. ఇటీవల తాడిపత్రిలో నిర్వహించిన మహిళా సదస్సులో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి లం.. భాష మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలన్నా, వారి ఓట్లన్నా జేసీ ప్రభాకర్‌రెడ్డికి చులకన భావం అన్నారు. గతంలో మాదిరి గ్రామాల్లో ఫ్యాక్షన్ వర్గాలు లేవని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పిల్లలు బాగా చదువుకుని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాప్ట్‌వేర్‌లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. తల్లిదండ్రులఅప్పులు తీర్చి గ్రామాల్లో గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, వేమనాథరెడ్డి, రామ్మూర్తిరెడ్డి, రామిరెడ్డి, యోగేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, కాశి, సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీరెడ్డి, మస్తాన్, రంగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేష్‌నాయుడు, సంజీవరాయుడు, లక్ష్మీదేవి, వెంకటరామిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మల్లికార్జున, అశోక్‌రెడ్డి, పెద్దయ్య, ప్రసాద్‌రెడ్డి, భాస్కరరెడ్డి, రంగ, లక్ష్మీనాథరెడ్డి, తలారి శివయ్య తదితరులు పాల్గొన్నారు.


