‘పసుపు’ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

‘పసుపు’ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులు

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

టీడీపీ కార్యకర్తలతో కలిసి కూడేరు సీఐ హల్‌చల్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తెలుగుదేశం పార్టీ ‘పసుపు పండుగ’ మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులు తరించారు. కొందరు కార్యకర్తలు మాదిరిగా మారిపోతే.. మరికొందరు అదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా విధులు నిర్వర్తించి విమర్శలు మూటగట్టుకున్నారు. బుధవారం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో నాయకులు, కార్యకర్తల మధ్యలో సీఐ రాజు ఆశీనులయ్యారు. అంతేకాదు సెల్ఫీలు దిగి.. కేకులు కట్‌ చేశారు. దీంతో ఖాకీ ముసుగులోని ‘పసుపు రంగు’ను ప్రదర్శించినట్లయ్యింది. గతంలో కూడేరు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చడం విమర్శలకు దారి తీసింది. అప్పట్లో సీఐ తీరును ఎండగడుతూ ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, యువనేత ప్రణయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అయినా సీఐ తన పద్ధతి ఏమాత్రమూ మార్చుకోకుండా మహానాడులో హల్‌చల్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పసుపు జెండాలు కట్టిన ‘పంచాయతీ’

ఉరవకొండలోని దేవాంగ కల్యాణ మండపం, టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు ఏర్పాట్లలో పంచాయతీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఆవరణమంతా టీడీపీ జెండాలు కట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement