అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీగా అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావుకు పదోన్నతి దక్కింది. కాగా ఈ నెల 30న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో జిల్లాలోనే ఆయన అదనపు ఎస్పీగా బాధ్యతలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.
దత్తతకు చిన్నారులు
అనంతపురం సెంట్రల్: కణేకల్లులోని ఆర్డీటీ హోం, ఎస్‌వీ పురం హోంలో ఆశ్రయం పొందుతున్న ముడావత్ సెల్వనాయక్(15), ప్రియదర్శిని(14) తల్లిదండ్రులు, సంబంధీకులు ఎవరైనా ఉంటే 30 రోజుల్లోపు సంప్రదించాలని ఐసీడీఎస్ పీడీ శశికళ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధీకులు ఎవరూ ముందుకు రాకపోతే బాలల సంక్షేమ సమితి నిబంధనల మేరకు అనాథలుగా ప్రకటించి దత్తతకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
సెల్వనాయక్, ప్రియదర్శిని


