సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ తనిఖీల్లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ తనిఖీల్లో ఉద్రిక్తత

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

మున్సిపల్‌ ఎస్‌ఐపై దాడి

అనంతపురం క్రైం: నగరంలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిర్మూలనపై అనంతపురం నగరపాలక సంస్థ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ ఉద్రిక్తతకు దారితీసింది. వారం రోజులుగా నగరపాలక సంస్థ అధికారులు, వార్డు సచివాలయ ఉద్యోగులు నగరంలోని వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఫుడ్‌ సెంటర్లు, ఓళిగ సెంటర్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అలహాబాద్‌ బ్యాంక్‌ ఎదురుగా ఉన్న ఓళిగ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అధికారులతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పి 4వ సర్కిల్‌కు చెందిన మున్సిపల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, శానిటేషన్‌ సెక్రటరీపై దాడికి పాల్పడ్డారు. విజయ్‌కుమార్‌కు గాయాలైనట్లు తెలిసింది. ఘటనపై మూడో పట్టణ పీఎస్‌లో మునిసిపల్‌ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement