పెనుకొండ రూరల్: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కియా పీఎస్ ఎస్‌ఐ డి.రాఘవయ్య తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం అనంతపురం నుంచి బెంగళూరుకు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ధాన్యం తరలింపులకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో డ్రైవర్ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీ ప్రభావతికి అప్పగించారు.


