కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రజల జీవనాడి భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ). రెండు నియోజకవర్గాలలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. కాలువ తవ్వకం కోసం బడ్జెట్‌లో ఒక్క పైసా కే | - | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రజల జీవనాడి భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ). రెండు నియోజకవర్గాలలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. కాలువ తవ్వకం కోసం బడ్జెట్‌లో ఒక్క పైసా కే

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

కళ్యాణదుర్గం: బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 93 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణం, ఎనిమిది లిఫ్ట్‌లు, ఎనిమిది సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇందుకోసం భూ సేకరణకు కాకుండా రూ.542 కోట్ల నిధులు అవసరం. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కాలువ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు నింపడానికి 1.7 టీఎంసీలు, భైరవాని తిప్ప ప్రాజెక్టుకు 2 టీఎంసీలను తరలించి ఆ ప్రాంత తాగు, సాగు నీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు లక్ష్యం.

అంతా ప్రచార ఆర్భాటమే..

టీడీపీ ప్రభుత్వం బీటీపీ కాలువ నిర్మాణం పేరిట మొదటి నుంచి ఆర్భాటమే చేస్తూ వస్తోంది. 2018లో భూ సేకరణ చేయకుండానే హడావుడిగా ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అప్పట్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్‌ తిరిగి కొలువుదీరింది. కాలువ పనులను దక్కించుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ సంస్థ మాత్రం పనులను పూర్తి చేయలేకపోయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ– స్టాంప్‌ కుంభకోణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనకు ఆ మరకలు అంటకుండా ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు ఆర్భాటంగా బీటీపీ కాలువ పనులు మొదలు పెట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా తన సొంత డబ్బుతో కాలువ పనులు పూర్తి చేస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.

అర్ధంతరంగా ఆగిన పనులు

సొంతంగా కాలువ పూర్తి చేస్తానని చెప్పిన అమిలినేని మాటపై నిలబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ ఆయనకు చెందిన కాంట్రాక్టు సంస్థ ఎస్‌ఆర్‌సీ బీటీపీ కాలువ పనులను అర్ధంతరంగా ఆపేసింది. కాలువ పనుల కోసం కళ్యాణదుర్గం ప్రాంతానికి తీసుకువచ్చిన భారీ యంత్రాలను చంద్రబాబు మెప్పు కోసం కుప్పంకు నీటిని తీసుకెళ్లే పనుల నిమిత్తం తరలించినట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో బీటీపీ కాలువ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అసలు ఇంతకూ బీటీపీ కాలువ నిర్మాణం ఈ ప్రభుత్వ హయాంలో సాకారమవుతుందో లేదోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలువ కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం కింద రూ.128.85 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. రెండేళ్లయినా దీనిపై ఎటువంటి ప్రకటనా లేదు.

రూ.208.85

80

రూ.

భూసేకరణకు అవసరమైన నిధులు

కోట్లు

రూ.

గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు అందించిన పరిహారం

చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందించాల్సిన పరిహారం

128.85

ముందుకు కదలని బీటీపీ కాలువ పనులు

నిధులు రాలేదంటూ పనులు ఆపేసిన ఎస్‌ఆర్‌సీ

సొంతంగా పూర్తి చేస్తానని మాట తప్పిన ఎమ్మెల్యే అమిలినేని

Advertisement
 
Advertisement
Advertisement