అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్ సెక్షన్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ టి.నారాయణరెడ్డి, ఎగ్జామినేషన్స్ ఇన్‌చార్జ్ కె.మాధవి, ప్రొఫెసర్ ఆర్.రాజశేఖర్, ప్రొఫెసర్ జయలక్ష్మి, డాక్టర్ కళ్యాణి రాధ తదితరులు పాల్గొన్నారు.


