సజావుగా సివిల్స్‌ ప్రిలిమినరీ | - | Sakshi
Sakshi News home page

సజావుగా సివిల్స్‌ ప్రిలిమినరీ

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

అనంతపురం అర్బన్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష అనంతపురంలో సజావుగా జరిగింది. అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. రెండు సెషన్లుగా ఏడు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,514 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం సెషన్‌కు 1,658 మంది అభ్యర్థులు (66 శాతం) హాజరవగా 856 మంది (34 శాతం) గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం సెషన్‌కు 1,635 మంది అభ్యర్థులు (65 శాతం) హాజరుకాగా 879 మంది (35 శాతం) గైర్హాజరయ్యారు. రెండు సెషన్లూ కలిపి అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. యూపీఎస్సీ జిల్లా పరిశీలకులు గంధం చంద్రుడు, కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు అందుబాటులో ఉంచారు.

ఆలస్యమై బాధతో వెనుదిరిగి..

యూపీఎస్‌సీ నిబంధన మేరకు ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని స్పష్టంగా చెప్పారు. ఆర్ట్స్‌ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షకు మహబూబ్‌, చరిత్ర, మౌళి, హర్ష, కుమార్‌, నందకిషోర్‌, నరేష్‌, యువరాజ్‌, శ్రావణ్‌ (కర్నూలు), మరికొంత మంది అభ్యర్థులు తొమ్మిది గంటల తరువాత కేంద్రానికి చేరుకున్నారు. నిబంధన ప్రకారం వారిని లోనికి అనుమతించలేదు. ఇలాగే మిగతా ఆరు కేంద్రాల్లోనూ కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో లోనికి అనుమతించలేదు.

అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల వద్ద అభ్యర్థుల సందడి... బయోమెట్రిక్‌ తీసుకుంటున్న సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement