ఉరవకొండ: ‘ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై వైఎస్సార్‌సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలి. ప్రతి ఓటునూ కీలకంగా భావించాలి’ అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గోవర్ధన్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీరశైవ కల్యాణ మండలపంలో నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశించే వారి పై కూటమి నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో పాటు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న శ్రీహరి, కొమ్మసాని, ప్రొఫెసర్ నాగేశ్వరావు లాంటి సీనియర్ జర్నలిస్టులపై కూడా కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందురు సిద్ధం కావాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా టీడీపీ నేతలు కుట్ర పన్నే అవకాశం ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సర్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తూ ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్‌రెడ్డి మాట్లాడుతూ సర్ కార్యక్రమం పై ఏమరపాటుగా ఉంటే సరిదిద్దుకొనే అవకాశం ఉండదని, ప్రతి బీఎల్‌ఎ జూన్ 15 నుంచి జూలై 15 వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క ఎలాంటి పొరపాట్లు చేసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం సర్‌పై పార్టీ అబ్జర్వర్లు గోపీనాథ్‌యాదవ్, శివారెడ్డి స్క్రీన్ పై బీఎల్‌ఎలకు డెమో ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జోనల్ అధికార ప్రతినిధి బెస్త రమణ, ఎంపీపీలు దేవిబాయి, కరణం పుష్పవతి, నరసింహులు, త్రిలోక్‌నాథ్, ఏసీ ఎర్రిస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బసవరాజు, డిష్ సురేష్, ఓబన్న, కౌడిగి గోవిందు, ఎర్రిస్వామిరెడ్డి, గొట్కూరు మల్లికార్జున, మఠం వీరేష్, ఐదు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ, గోవర్ధన్‌రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ ఏజెంట్లు
ఎస్‌ఆర్‌ఐపై అప్రమత్తత అవసరం
అధికార పార్టీ నేతల కుట్రలు తిప్పికొట్టాలి
బూత్ ఏజెంట్లకు వైఎస్సార్‌సీపీ నేతల దిశా నిర్దేశం


