● 34 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
ఉరవకొండ: స్థానిక ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ 1990–92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చదువులు చెప్పిన గురువులకు మేళాతాళలతో ఊరేగింపుగా కళాశాలకు తీసుకొచ్చారు. అనంతరం చదువుకున్న కళాశాలలో తమకున్న జ్ఞాపకాలను, యోగ క్షేమాలను ఒకరికొకరు తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులు వెంకటేశ్వర్లు, చలమారెడ్డి, సలామ్, ఇమామ్‌వలి తదితరులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.


