పిల్లలను విద్యావంతులను చేయండి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను విద్యావంతులను చేయండి

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

అనంతపురం టవర్‌క్లాక్‌: బలిజలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ పిల్లలను విద్యావంతులు చేయాలని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు తొండపునాటి శంకరయ్య అన్నారు. ఆదివారం స్థానిక శ్రీనివాసనగర్‌లోని బాలజీ కల్యాణ మంటపంలో రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. శంకరయ్య మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలిజ కులానికి చెందిన విద్యార్థులకు 20 ఏళ్లుగా ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. కష్టపడి, ఇష్టపడి చదివి మంచి ఉన్నతస్థాయికికి చేరుకోవాలని, తల్లిదండ్రులతో పాటు బలిజ జాతికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో దాదాపు 900 మంది విద్యారులు, వారి తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహితి, మాజీ అధ్యక్షుడు పామురాయి వెంకటేష్‌, వెంకటరాముడు, విజయ్‌ భాస్కర్‌, తొండపునాటి రమేష్‌, చలపతి, జీవీ రమణ, శివయ్య రంగనాయకులు, నగేష్‌, పవన్‌కుమార్‌, సూర్యనారాయణ, పద్మజ, మురళీకృష్ణ, గిరిధర్‌ ప్రసాద్‌, సాయి ప్రసాద్‌, కృష్ణమూర్తి, సత్యనారాయణ, నాగేంద్ర కుమార్‌, రవికుమార్‌, లెనిన్‌, రామకృష్ణ, అనిల్‌కుమార్‌, పెద్దన్న, మనోజ్‌కుమార్‌, పూల సుధాకర్‌, రామాంజి నేయులు, దండు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement