పుట్లూరు: చూడటానికి చిన్న సైజు చిరుతలా ఉండే అడవి పిల్లి అరటి తోటలో పనులు చేసుకుంటున్న వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటన మండలంలోని దోసలేడు గ్రామ సమీపంలోని మడుగుపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు .. పుట్లూరు మండలం దోసలేడుకు చెందిన రామాంజినమ్మ అనే వృద్ధురాలు మరో మహిళతో కలిసి గ్రామ సమీపంలోని అరటి తోటలో కలుపుతీత పనులకు వెళ్లింది. వారు పనుల్లో నిమగ్నమైన సమయంలో విచిత్రమైన అరుపులతో పిల్లి ఒక్కసారిగా రామాంజినమ్మ మొహం, తల, చేతులపై దాడి చేసింది. భయబ్రాంతులకు గురైన కూలీలు కర్రలు తీసుకుని అడవి పిల్లిపై దాడి చేయడంతో చనిపోయింది. రామాంజినమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


