●మెటీరియల్‌ ఉన్నా.. అసంపూర్తిగానే | - | Sakshi
Sakshi News home page

●మెటీరియల్‌ ఉన్నా.. అసంపూర్తిగానే

May 24 2026 12:51 AM | Updated on May 24 2026 12:51 AM

విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. అదనపు గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నాంది పలికారు. అయితే అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులు పూర్తి కావాల్సిన తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పెండింగ్‌లో ఉన్న 10 నుంచి 30 శాతం పనులు పూర్తి చేయని చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుక, కంకర, స్టీల్‌ తదితరాలు సమృద్ధిగా ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు. కనీసం ఈ ఏడాదైనా ఈ పనులు పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

అనంతపురంలోని పొట్టి శ్రీరాములు స్కూల్‌లో వృథాగా పడేసిన ఇసుక, ఇటుకలు, శ్రీకృష్ణదేవరాయ స్కూల్‌లో పెండింగ్‌లో ఉన్న భవనం పనులు

Advertisement
 
Advertisement
Advertisement