అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా పలు పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రమేష్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీడీసీ డీన్‌గా డి.ప్రభాకర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్‌గా ఎంవీ లక్ష్మయ్య, ఫార్మాసూటికల్స్ డైరెక్టర్‌గా సి.సురేష్‌కుమార్, యూజీసీ డీన్‌గా జి.నరసింహన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా జీవీ రమణ, అడిషనల్ వార్డెన్ (మెన్) ఎన్‌ఆర్ సదాశివారెడ్డి, అడిషనల్ వార్డెన్ (ఉమెన్) జె.ఖేజియారాణి, ఉమెన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా ఎస్.అనిత (బయోటెక్నాలజీ), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్‌ను దాశరథి రవీంద్ర, పీఆర్వోగా డాక్టర్ మాధవికు అప్పగించారు.
ఉత్సాహంగా జాతీయ స్థాయి రాతి దూలం పోటీలు
పెద్దవడుగూరు: మండలంలోని ఆవులాంపల్లిలో జాతీయ స్థాయి వృషభాల బల ప్రదర్శన మూడో రోజు సీనియర్ విభాగం పోటీలు హోరాహోరీగా సాగాయి. 11 జతల వృషభాలు పోటీలో పాల్గొనగా తెలంగాణలోని హుజునగర్‌కు చెందిన రైతు సుంకి సురేంద్రరెడ్డి ఎస్‌ఎస్‌ఆర్ బుల్స్ ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్‌కే బుల్స్, తృతీయ స్థానంలో హైదరాబాద్‌లోని ప్రగతి రీస్టార్ట్ బుల్స్, నాల్గో స్థానంలో అనంతపురం జిల్లా చౌటపల్లి రైతు ఓబుళరెడ్డి, అక్కంపల్లి ఇంద్రారెడ్డి వృషభాలు, ఐదో స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్‌కే బుల్స్, ఆరో స్థానంలో అనంతపురం జిల్లా రేగడికొత్తూరు ఆలగనురు గౌతమిరెడ్డి వృషభాలు, ఏడో స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ వృషభాలు, ఎనిమిదో సాఓ్థనంలో పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి రైతు తోట తిరుపాల్‌రెడ్డి వృషభాలు, కామాలాపురం ఆదిల్‌కు చెందిన వృషభాలు, తొమ్మిదో స్థానంలో వైఎస్సార్ జిల్లా కల్లూరు శివకృష్ణయాదవ్ వృషబాలు నిలిచాయి. విజేతలకు ఎస్‌ఐ ఆంజనేయులు, నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే ఆవులాంపల్లి చుట్టు ప్రక్కల గ్రామాల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు డోజర్ రమేష్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు.


