అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) జిల్లా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతపురంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌రావు అధ్యక్షతన శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కె. వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా సి. గోపాలరెడ్డితో పాటు ఆర్థిక కార్యదర్శిగా బీఏ శంకరమూర్తి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా కేవీ ప్రభాకరరెడ్డి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా కె.నారాయణ, ఉపాధ్యక్షులుగా ఐదుగురిని, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఏడుగురిని, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నలుగురిని ఎన్నుకున్నారు. నాయకులు శివానంద, మస్తాన్ వలి, కుళ్లాయప్ప, సూర్యనారాయణ, శ్రీనివాసులు, కోటేశ్వరరాజు, శిజ, రామకృష్ణ, మల్లారెడ్డి, కె.నాగేంద్ర పాల్గొన్నారు.


