
‘శుభప్రదమ్’ ఆరంభం
గుంతకల్లు: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్యరాజేష్, ’మిరాయ్’ హీరోయిన్ రితికానాయక్ శుక్రవారం గుంతకల్లులో సందడి చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటైన ‘శుభప్రదమ్’ మెగా షాపింగ్ మాల్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్.భవానితో కలసి షోరూమ్ మొత్తం కలియతిరిగారు. ఫొటోలకు ఫోజులిస్తూ సెల్పీలతో ఉత్సాహ పరుస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీలోనే మొట్టమొదటి శుభప్రదమ్ మెగా షోరూంను తమ చేతుల మీదుగా, అందులోను గుంతకల్లులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శుభకార్యాలకు దుస్తుల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సరసమైన ధరకే శుభప్రదమ్ షాపింగ్ మాల్‌లో ఎంతో నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగొళ్లపై చక్కటి ఆఫర్లను నిర్వాహకులు అందజేస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం షోరూమ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఇద్దరు హీరోయిన్లు పలు పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. కార్యక్రమంలో శుభప్రదమ్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు పసుపుల హరినాథ్, మంజు. ఓంకార్, పత్రాల సురేష్, రంగ తదితరులు పాల్గొన్నారు.
తారలు దిగిరావడంతో సందడిగా మారిన గుంతకల్లు
ఏపీలోనే మొట్టమొదటి షోరూం