
ప్రతి ఇంటా కాంతులు విరియాలి
అనంతపురం: దీపావళి పండుగతో ప్రతి ఇంటా ఆనందాల కాంతులు విరియాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటి అనే చెడును పారదోలే వెలుగు అనే మంచికి సంకేతంగా దీపావళిని జరుపుకుంటామని పేర్కొన్నారు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు వారి దగ్గర ఉండి జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు.
కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఓ.ఆనంద్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి అనుగ్రహంతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, అందరి ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. దీపావళిని అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి
అనంతపురం టవర్‌క్లాక్: దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రజలకు ఆదివారం ఆమె పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ప్రతి ఇంటా కాంతులు విరియాలి

ప్రతి ఇంటా కాంతులు విరియాలి