21 నుంచి పోలీసు అమర వీరుల వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

21 నుంచి పోలీసు అమర వీరుల వారోత్సవాలు

Oct 20 2025 9:06 AM | Updated on Oct 20 2025 9:06 AM

21 నుంచి పోలీసు అమర వీరుల వారోత్సవాలు

21 నుంచి పోలీసు అమర వీరుల వారోత్సవాలు

అనంతపురం సెంట్రల్‌: పోలీసు అమర వీరుల వారోత్సవాలను ఈనెల 21 నుంచి 31 వరకూ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జగదీష్‌ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 1959 అక్టోబర్‌ 21న లడక్‌లో చైనాతో జరిగిన యుద్ధంలో అనేక మంది దేశం కోసం అసువులు బాశారని, అమరవీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వారోత్సవాలు ఇలా..

● 21న స్మృతి పరేడ్‌, పోలీసు అమరులకు నివాళి.

● 22, 23 తేదీల్లో పోలీసు అమరుల గ్రామాల

సందర్శన, అమరుల సేవలపై అవగాహన.

● 24 నుంచి 27 వరకూ చర్చా వేదికలు,

వక్తృత్వపు పోటీలు.

● 26న పోలీసు త్యాగాలు, పరాక్రమాలు

తెలియజేసే చిత్ర ప్రదర్శన.

● 26 నుంచి 27 వరకూ ఓపెన్‌హౌస్‌,

విద్యార్థులకు అవగాహన.

● 28న వైద్య శిబిరాలు.

● 29న పోలీసుల త్యాగాలపై సెమినార్లు,

ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

● 30న పోలీసు అమరుల

కుటుంబ సభ్యులకు సన్మానం.

● 31న జిల్లా వ్యాప్తంగా సమైక్యతా దినం ఆచరణ, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement