
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
ప్రజల ప్రయోజనాల కోసం నిజాలు వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. సాక్షి మీడియా నిజాలు రాస్తే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. నకిలీ మద్యం, అవినీతి, ప్రజా సమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రజాస్వామ్య బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోంది. ఇది కేవలం ఒక పత్రికపై దాడి కాదు. మీడియా స్వేచ్ఛపై దాడి.
– అనంత వెంకట్రామి రెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
విమర్శ స్వీకరించే ధైర్యముండాలి
ప్రభుత్వానికి ఏమి అవసరమో అది మాత్రమే వినపడాలి అనే ధోరణి సరికాదు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏకంగా 11 కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలి. తప్పుడు కేసునుల వెంటనే ఎత్తేయాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానం మానుకోవాలి. జర్నలిస్టుల గళాన్ని అణచే చర్యలను తక్షణం ఆపాలి. – వి.రాంభూపాల్,
సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు
అనంతపురం: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్‌పై కరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడేనని రాజకీయ, జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ఖండిస్తున్నారు. పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే

ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే