
మోసం చేయడం చంద్రబాబు నైజం
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
బుక్కరాయసముద్రం: నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం బీకేఎస్ మండల పరిధిలోని గాంధీ నగర్, అమ్మవారిపేట, రేకులకుంట గ్రామంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్ రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను మోసం చేసి టీడీపీని లాక్కున్నారన్నారు. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత మోసం చేయడాన్ని రివాజుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు 30 ఏళ్ల చరిత్రలో చెప్పుకోదగ్గ ఒక్క పథకమూ లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వైఎస్సార్ సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముసలన్న, మహిళా రాష్ట్ర కార్యదర్శి లలితా కల్యాణి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, సర్పంచ్‌లు పార్వతి, నరసమ్మ, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, ఆది, ముత్యాలశీన, నందినే మల్లికార్జున, 6 మండలాల అధ్యక్షులు పూల ప్రసాద్, ఎల్లారెడ్డి, మహేశ్వరెడ్డి, ఖాదర్‌వలి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు
మాట్లాడుతున్న మాజీ మంత్రి శైలజానాథ్

మోసం చేయడం చంద్రబాబు నైజం