
దళితులపై దౌర్జన్యాలను తిప్పికొట్టాలి
దళితులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోఓబులేసు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మిద్దె కుళ్లాయప్ప పిలుపునిచ్చారు.నార్పల మండలంలో ఎస్సీ యువకుడు, వికలాంగుడు అయిన చిన్న కుళ్లాయప్పను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించి మడకశిరకు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బందులకు గురి చేయించారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మండిపడ్డారు. కుప్పంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎంఎస్ రాజు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి ఏనాడైనా స్పందించారా అని నిలదీశారు. దళిత బిడ్డల మానప్రాణాలు పోతున్నా.. పట్టించుకోకుండా.. చంద్రబాబు తొత్తుగా మారారని విమర్శించారు.
సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు