
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగన్
అనంతపురం : అణగారిన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఎస్సీ సెల్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్ కమార్‌రెడ్డి, విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు అకృత్యాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.77 వేల కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎస్సీలకు నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ మోసాన్ని అందరికీ తెలియచెప్పాలన్నారు. రాష్ట్రమంతటా లక్ష మంది ఎస్సీ యువకులతో ‘జగనన్న దళిత ఫోర్స్’ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతనంగా మంజూరైన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ కేటగిరీలో 880 సీట్లు కోల్పోయే ప్రమాదముందన్నారు. డాక్టర్ కావాలనే కలను కూటమి ప్రభుత్వం చిదిమేసిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, ఉమ్మడి జిల్లా అబ్జర్వర్ నల్లాని బాబు, రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర మహిళా అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, జిల్లా ప్రధాన కార్యదర్శి శోభ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పసులూరు ఓబులేసు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోవిందప్ప, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రాఘవ, గుంతకల్లు అధ్యక్షుడు వీరేష్ బాబు, కళ్యాణదుర్గం అధ్యక్షడు తిప్పేస్వామి, రాయదుర్గం అధ్యక్షుడు కె.రామాంజినేయులు, ఉరవకొండ అధ్యక్షుడు అక్కులప్ప, కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు, శింగనమల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఆంజినేయులు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేది జగన్‌మోహన్‌రెడ్డేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారాన్ని అప్పగించడడంతో పాటు సమ సమాజాన్ని స్థాపించడమే ఆయన లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగానే గత మంత్రి వర్గంలో 70 శాతం బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అప్పగించారని తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు పెత్తందార్లకు దన్నుగా ఉంటూ పేదలను విస్మరించారని అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించారని గుర్తు చేశారు.
సమసమాజ స్థాపనే జగన్ లక్ష్యం
పేదలను విస్మరించిన బాబు
కూటమి ప్రభుత్వంలో దళితులపై పెరిగిన అకృత్యాలు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో ఎస్సీ విద్యార్థులకు అన్యాయం
ఈ అన్యాయాన్ని ప్రతి పౌరునికీ తెలియజేయాల్సిన బాధ్యత మనదే
లక్ష మంది ఎస్సీ యువకులతో జగనన్న ఫోర్స్
ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగన్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగన్