
సీజేఐపై దాడి అమానుషం
అనంతపురం అర్బన్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడి అమానుషమని, ఈ దాడి రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై మతోన్మాదుల దాడికి నిరసనగా బుధవారం స్థానిక గణేనాయక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మానికి అవమానం జరిగిందంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగా చెప్పు విసరడం దేశంలో నెలకొన్న అస్థిరతకు అద్దం పడుతోందని మండిపడ్డారు. మోదీ పాలనలో మతోన్మాదులు అన్ని వ్యవస్థలను ఇప్పటికే ధ్వంసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, నాయకులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, రామిరెడడి, చంద్రశేఖర్‌రెడ్డి, సావిత్రి, కృష్ణమూర్తి, శ్రీనివాసులు, పరమేష్, ఆర్‌వీనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్