
‘కూటమి’ మాటలు విని మోసపోయాం
ఉరవకొండ: ఎన్నికల సమయంలో కూటమి పెద్ద చంద్రబాబు అండ్ కో మాటలు నమ్మి మోసపోయామని అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక వీరశైవ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీరశైవ లింగాయత్‌లను శైవక్షేత్రాల్లోని పాలకమండలి కమిటీల్లో అత్యధిక ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయిమస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలను ప్రభుత్వం నియమించిందని అయితే వీటిలో వీరశైవ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరినీ నియమించకపోవడం బాధాకరమన్నారు. ఇది వీరశైవ లింగాయత్‌లను మోసం చేయడమేనని అన్నారు. అలాగే 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బీసీ–డీ లో లింగాయత్‌లను చేరుస్తూ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఈ ఫైల్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుండా తొక్కి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న వీరశైవుల ఆర్థిక, సామాజిక, విద్య పరంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వీరశైవలింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లాలన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద