
గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు కౌన్సెలింగ్
అనంతపురం రూరల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–4కు పదోన్నతి కల్పిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను జిల్లా పంచాయతీ కార్యాలయంలో బుధవారం చేపట్టి పంచాయతీ కార్యదర్శుల నుంచి ఆప్షన్లను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 154 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ఉండగా, వీరందరికీ గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా పంచాయతీ అదికారి సమత, తదితరులు పాల్గొన్నారు.
మిద్దె పైనుంచి జారి పడి
వ్యక్తి మృతి
అనంతపురం: మిద్దైపె నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని నీరుగంటివీధికి చెందిన బండి లక్ష్మీనారాయణ (43) బుధవారం ఉదయం తన ఇంటి బాల్కానీ గోడపై కూర్చొని ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితికి చేరుకున్న ఆయనను కుటుంబసభ్యులు వెంటనే జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య అనిత, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.