
అశ్వవాహనం అధిష్టించి.. అభయమిచ్చి
తాడిపత్రి రూరల్: భూదేవి, శ్రీదేవి సమేత చింతలవెంకటరమణస్వామి ఆలయంలో బుధవారం స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు మూలవిరాట్‌కు అర్చకులు మురళిస్వామి అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీనులను గావించారు. అనంతరం స్వామి వారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను దీవించారు.
నేడు చక్రస్నానం
చింతలవెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగియనున్నాయి. చివరి రోజు భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజల అనంతరం చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు ముగింపు పలుకుతారు.