
‘డైట్’ కళాశాలకు గ్రాంట్ విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీసత్యసాయి జిల్లా డైట్ కళాశాలకు 2025–26 సంవత్సరానికి సంబంధించి గ్రాంట్ విడుదల చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పద్దుల కింద మొత్తం రూ.9. 90 లక్షలు విడుదల చేశామన్నారు. ఇందులో 50 శాతం వార్షిక గ్రాంట్ రూ. 7.50 లక్షలు, టెక్నాలజీ సపోర్ట్ కింద రూ. 2.40 లక్షలు ఉన్నాయన్నారు. నిబంధనలకు లోబడి ఖర్చు చేసి వివరాలను టీసీఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
సెలవులో జీజీహెచ్
సూపరింటెండెంట్
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం సెలవులో వెళ్లారు. ఆయన ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మైసూర్‌లో వైద్య విద్యార్థులకు నిర్వహించే పరీక్షకు ఎగ్జామినర్‌గా వెళ్లారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ శౌరీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించనున్నారు. కాగా, చిన్నపిల్లల విభాగం, గైనిక్, అనస్తీషియా, మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, సర్జరీ తదితర విభాగాల్లోని సీనియర్ ప్రొఫెసర్లను కాదని జూనియర్ అయిన డాక్టర్ శ్రీనివాస్ శౌరీకి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.