
అరటిలో యాజమాన్యంపై శిక్షణ
యల్లనూరు: అరటి, చీనీ పంటలను ఆశించే చీడపీడల నివారణకు సరైన చర్యలు తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఉద్యాన సంయుక్త సంచాలకులు దేవమునిరెడ్డి అన్నారు. ‘ఉద్యాన పంటలకు తెగుళ్లు’ శీర్షికన గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో యల్లనూరు మండలం వేములపల్లి, కూచివారిపల్లి గ్రామాల్లో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, అరటి పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. అంతకు ముందు మండలంలో చీనీ, అరటి తోగలను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి, నార్పల ఉద్యాన అధికారి నెట్టికంటయ్య, హెచ్‌ఈఓ రామాంజనేయులు, వీహెచ్‌ఎస్‌లు మురళి, ప్రవీణ్, మస్తాన్, ఆయేషా, రైతులు పాల్గొన్నారు.
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ స్కోరర్‌గా తాడిపత్రి వాసి
తాడిపత్రి టౌన్: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ – 2025 టోర్నీ స్కోరర్‌గా తాడిపత్రికి చెందిన వినయ్ ఎంపికయ్యాడు. ఈ నెల 9 నుంచి 26వ తేదీ వరకూ విశాఖపట్నంలో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వినయ్ స్కోరర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి భీమలింగారెడ్డి మంగళవారం వెల్లడించారు. వినయ్ ఎంపికపై జిల్లా ఆంఫైర్ అసోసియేషన్ సెక్రటరీ అన్సర్‌ఖాన్, ఆర్డీటీ కోచ్ యుగంధర్, తాడిపత్రి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సాదిక్‌వలి, తాడిపత్రి ఆర్డీటీ సబ్‌సెంటర్ కోచ్ భార్గవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

అరటిలో యాజమాన్యంపై శిక్షణ

అరటిలో యాజమాన్యంపై శిక్షణ