
విజయవాడలో కలెక్టర్ ఓ.ఆనంద్
అవార్డు అందుకున్న కలెక్టర్
అనంతపురం అర్బన్: స్వచ్ఛ జిల్లా అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం విజయవాడలో కలెక్టర్ ఓ.ఆనంద్ అందుకున్నారు.
జ్యుడీషియల్ స్టాంప్‌లు కావలెను!
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జ్యుడీషియల్ స్టాంప్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని వారాలుగా స్టాంపులు లభించక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూ. 50, రూ. 100 స్టాంపులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని స్టాంపుల విక్రయ కేంద్రంలో ‘నో స్టాక్’ బోర్డు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఏ ఒక్క కార్యాలయంలోనూ స్టాంపులు దొరకడం లేదు. దీంతో స్టాంప్ వెండార్లు, కామన్ సర్వీస్ కేంద్రాలను వినియోగదారులు ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రతి స్టాంపుపై రూ.20–30 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ భార్గవను వివరణ కోరగా జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని, రెండు మూడు రోజుల్లో అన్ని రకాల స్టాంపులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

జ్యుడీషియల్ స్టాంప్‌లు కావలెను!