
ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా...
ఆధిపత్య పోరుతో ఫ్యాక్షన్‌కు బీజం పడి గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. ఫ్యాక్షన్ కారణంగా సర్వమూ కోల్పోయాను. పేదరికంతో కొట్టుమిట్టాడాను. పిల్లలను చదివించుకోలేక పోయా. ఆ సమయంలో గుంటూరు ప్రాంతంలోని వడ్లపూడికి చెందిన రైతులు మా గ్రామంలోని భూములను గుత్తకు తీసుకుని కరివేపాకు సాగు చేపట్టారు. దీంతో కరివేపాకు సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నా భార్యకు వివాహ సమయంలో పుట్టింటి వారు తాడిపత్రిలో ఇచ్చిన స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో గ్రామంలో ఐదు ఎకరాల పొలం కొనుగోలు చేసి, కరివేపాకు సాగు చేపట్టాను. లాభాలు రావడంతో ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించాను. ప్రస్తుతం నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కరివేపాకు పంట నా ఒక్కడి జీవితాన్నే కాదు గ్రామంలో అందరి జీవితాలను మార్చింది.
– సూర్యనారాయణ, యర్రగుంటపల్లి