
టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ సాగుతోందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ఎన్నికల సమయలో ఇచ్చిన హమీని అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు విస్మరించారన్నారు. రాష్ట్రాన్ని కల్తీ మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తాగి వందలాది మంది మరణిస్తున్నారని, వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకే రూ. వేల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఎంతో పారదర్శకంగా నాడు మద్యం పాలసీని అమలు చేశారన్నారు. అనధికారిక బెల్టు షాపులను టీడీపీ నేతలు నిర్వహిస్తూ నిరుపేద కుటుంబాలను దోచుకుంటున్నారన్నారు.
ట్రాక్ పటిష్టతపై
నిఘా పెట్టండి : డీఆర్‌ఎం
గుంతకల్లు: రైల్వే ట్రాక్ పట్టిషతపై ప్రత్యేక నిఘా పెట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా ఆదేశించారు. గుంతకల్లు–అనంతపురం సెక్షన్‌లో డీఈఎన్ మణికంఠతో కలిసి ఆదివారం ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ రైలు మార్గం పటిష్టతను ఆయన పరిశీలించారు. టాక్ర్ భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఈఎన్‌కు వివరించారు.

టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ