
పట్టపగలే హైడ్రామా!
అనంతపురం: పట్టపగలే హైడ్రామా నడిచింది. గోవా మద్యం తరలిస్తూ కొందరు యువకులు ఎకై ్సజ్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దాదాపు వందకు పైగా కిలోమీటర్ల మేర సినీ ఫక్కీలో ఛేజింగ్‌చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు.
అడ్డుకుంటే చంపుతామంటూ...
గోవా నుంచి మద్యాన్ని బుధవారం ఉదయం అక్రమంగా జిల్లాలోకి తరలించుకుని వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమై ఆత్మకూరు మండలం వడ్డుపల్లి టోల్‌ప్లాజా వద్ద కాపు కాశారు. ఉదయం 10.30 గంటల సమయంలో అటుగా వచ్చిన స్విఫ్ట్ కారును అడ్డుకుని పరిశీలిస్తుండగా డ్రైవర్ వాకీ టాకీ ద్వారా వెనుక వస్తున్న ఇన్నోవా కారు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడం గమనించారు. దీంతో వెనువెంటనే మరో వాహనంలో ఆత్మకూరు వైపుగా ఎకై ్సజ్ అధికారులు వెళుతుండగా హంద్రీ–నీవా కెనాల్ వద్ద ఇన్నోవా కారు ఉన్నఫళంగా వెనక్కు తిరిగి కాలువ గట్టుపై నుంచి శరవేగంగా దూసుకెళ్లింది. దీంతో ఎకై ్సజ్ అధికారులు తమ వాహనంలో వెంబడించారు. ఒకానొక దశలో ఎకై ్సజ్ అధికారుల వాహనాన్ని ఢీకొని ముందుకు సాగుతూ ఇనుపరాడ్లను తీసి ప్రదర్శిస్తూ తమను అడ్డుకుంటే చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఎకై ్సజ్ అధికారులు వదలకుండా ఇన్నోవా కారును వెంబడిస్తూ వెళ్లారు. చివరకు సాయంత్రం 4 గంటల సమయంలో కర్ణాటక సరిహద్దులోని తిరుమణి వద్ద ఉన్న బాలసముద్రం టోల్ ప్లాజా వద్ద ఇన్నోవా కారును అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడింది వీరే..
స్విఫ్ట్ కారుతో పాటు, ఇన్నోవాను అదుపులోకి తీసుకున్న ఎకై ్సజ్ అధికారులు వాటిని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించారు. రెండు వాకీటాకీలు, మొత్తం రూ.1.76 లక్షల విలువ చేసే హనీగ్రేడ్ బ్రాందీ (180 ఎం.ఎల్)– 97 బాక్సులు, గోల్డెన్ ఏఎస్ ఫైన్ విస్కీ (180 ఎం.ఎల్) – 16 బాక్సులు, మాన్షన్ హౌస్ బ్రాందీ (750 ఎం.ఎల్)– 3 బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కె.వీరేంద్ర, డి. ప్రవీణ్, కె.వెంకటేష్, కె.పవన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. వీరిలో కె.వీరేంద్రపై మద్యం కేసులు చాలా ఉన్నాయని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. అయితే ఏనాడూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడలేదన్నారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన ఏఈఎస్ వి.శ్రీరాం, ఇన్‌స్పెక్టర్లు కె.అన్నపూర్ణ, ఎస్.అలీబేగ్, ఎస్‌ఐలు సి.నరేష్‌బాబు, ఎం.హరికృష్ణ, ఎన్.సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు రామచంద్ర, ఫణీంద్ర, రమేష్‌బాబు, కానిస్టేబుళ్లు వెంకటనారాయణ, వెంకటప్రసాద్, ఎస్.మారుతి, ఎం.మారుతి, శివానంద రెడ్డి, నాగముని, చరణ్ కుమార్, సందీప్, ఈఎస్‌టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జయనాథ్ రెడ్డి, హెచ్.ఆర్. ప్రసాద్ (ఎస్‌ఐ), అనంతపురం ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.
సినీ ఫక్కీలో దాదాపు వంద కిలో మీటర్లకు పైగా ఛేజింగ్
గోవా మద్యాన్ని తరలిస్తున్న ముఠా పట్టివేత
రూ.1,76,904 విలువైన మద్యం స్వాధీనం