
సకాలంలో ఈ–పంట నమోదు చేయాలి
ఉరవకొండ రూరల్: ఈ–పంట నమోదు ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో గడువు లోపు రైతుల ఈ–కేవైసీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. బుధవారం ఉరవకొండ మండలంచిన్నముష్టూరు, మోపిడి గ్రామాల పరిధిలోని పొలాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఆయా గ్రామాల పరిధిలో సాగు చేసిన కంది పంటను పరిశీలించి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించారు. ఈ–పంట నమోదు జిల్లాలో 5.46 లక్షల ఎకరాల్లో నమోదు కాగా, ఉరవకొండ మండల పరిఽధిలో 22 ఎకరాల్లో నమోదు అయినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఏఓ రామకృష్ణుడు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
27న ఉద్యోగ మేళా
అనంతపురం సెంట్రల్: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు అనుబంధ బీఎస్‌ఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలకు ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులు. 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ. 16వేల నుంచి రూ.25వేలు జీతం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27న ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
అమరావతికి తరలిన
డీఎస్సీ అభ్యర్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులు బుధవారం ఉదయం అమరావతికి తరలి వెళ్లారు. జిల్లాతో పాటు జోనల్ పోస్టులకూ ఎంపికై న వారితో పాటు సంబంధీకులు ఒకరు తోడుగా ఉన్నారు. ఉదయాన్నే అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాల వద్ద అల్ఫాహారం ముగించుకుని మొత్తం 45 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. బస్సులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. గురువారం అమరావతిలో జరిగే కార్యక్రమంలో సీఎం, విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకుంటారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మునీర్‌ఖాన్, శ్రీనివాసులు, డెప్యూటీ డీఈఓలు శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు.

సకాలంలో ఈ–పంట నమోదు చేయాలి