అనంతపురం అర్బన్: ఉరవకొండ, తాడిపత్రిలో ఎంఎస్‌ఎంఈ పార్కులను వారంలోపు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్‌కు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. సీఎస్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఎ. మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఒక్కో చోట 20 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వారంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలను పూర్తి చేస్తామన్నారు. ‘సీఐఐ’ భాగస్వామ్యంతో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మోడల్ కెరీర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో సీపీఓ అశోక్‌కుమార్, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ శివశంకర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, ఏపీఐఐసీ మేనేజర్ మల్లికార్జున, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, డీటీడబ్ల్యూఓ రామాంజ నేయులు, ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆర్‌ఎం సుమంత్, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పావని, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇన్నోవేషన్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలి
అనంతపురం: రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎన్‌టీయూ(ఏ) అడ్మిన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న శనివారం సెంటర్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభిస్తారని, ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఈ వి. రాజగోపాల్, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ జేఈ బాల కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్‌కుమార్