
అక్రమ అరెస్టులకు భయపడం
అనంతపురం టవర్‌క్లాక్: రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ అరెస్ట్‌లకు భయపడబోమని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ అనంతపురం జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రెడ్‌బుక్ రాజ్యాంగం నశించాలంటూ నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు రమేష్‌గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను ప్రజా గొంతుక నొక్కే దుశ్చర్యగా అభివర్ణించారు. 13 నెలల కూటమి పాలన వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరుస్తున్నామనే అక్కసుతోనే అక్రమ అరెస్ట్‌లకు ప్రభుత్వం తెరతీసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేని లిక్కర్ కేసులో మిథున్‌రెడ్డిని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అశాంతికి కారణమవుతున్నారని, ఈ అంశంపై రాష్ట్రపతి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడయితే అణిచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుందని చరిత్ర చెబుతున్న సత్యమన్నారు. అక్రమ అరెస్ట్‌లు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరా, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ రిజ్వాన్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి, అధికార ప్రతిధి మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, మాజీ నగర అధ్యక్షుడు సాకే శివశంకర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, సుధీర్‌రెడ్డి, కై లాష్, మంజునాథరెడ్డి, గురుదత్త, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, గౌస్‌బేగ్, సైపుల్లాబేగ్, అమరనాథ్‌రెడ్డి, అనిల్‌గౌడ్, దాదు, జయరామ్ నాయక్, శేఖర్ నాయుడు, దిలీప్‌రెడ్డి, రవితేజ, కార్పొరేటర్ చంద్రలేఖ, కుళ్లాయి స్వామి, అశోక్, నితిన్, హరి, వెంకట్, ఫయాజ్, రాహుల్‌రెడ్డి, ఆదిల్, నరేంద్రరెడ్డి, బాబా ఇమ్రాన్, వంశీనాయుడు, వేణు, శేఖర్, పులి కార్తీకేయ, గౌస్, వసీం తదితరులు పాల్గొన్నారు.
ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం
గుంతకల్లుటౌన్: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీయాదవ్, యువజన విభాగం గుంతకల్లు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌బాసిద్ అన్నారు. మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాల్లేకపోయినా ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆదివారం వైఎస్సార్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గుంతకల్లులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూపర్‌సిక్స్, ఇతర హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు అక్రమ అరెస్ట్‌లకు ప్రభుత్వం తెరతీసిందని మండిపడ్డారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల నియోజకవర్గ అధ్యక్షులు రంగనాయకులు, పవన్, అంజి, నారప్ప, సూర్యరెడ్డి, నాయకులు సూర్య, ఆనంద్, శివ, రాము రాయల్, సాయి సునీల్, రాజశేఖర్, మనోజ్, శాంతనాయుడు, లింగా, మణికంఠ, దాదా, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై పెల్లుబుకిన నిరసనలు
రెడ్‌బుక్ రాజ్యాంగం నశించాలంటూ నినాదాలు

అక్రమ అరెస్టులకు భయపడం