
ఓర్వలేక పోతున్నారు
కళ్యాణదుర్గం రూరల్: సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మోసం చేసిన తీరుని ప్రజాక్షేత్రంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తుండటాన్ని ఓర్వలేక... లేని కేసులను సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎంపీ మిథున్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులకు ఇది పరాకాష్ట అని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. లేని మద్యం కేసు సృష్టించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.