
ఎల్లకాలం సాగవు
గుంతకల్లు టౌన్: రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్‌సీపీని కట్టడి చేయాలనుకోవడం వారి అవివేకమన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. రాజకీయ కక్ష సాధింపులు మానకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.