
రేపు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని 1100 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తెలుసు కోవచ్చన్నారు. అర్జీలను meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలిపారు.
ఇన్‌చార్జ్ వీసీగా ఏడాది పూర్తి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ బి. అనిత పదవి చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమెను శనివారం వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, ప్రిన్సిపాల్ ఆంజినేయులు, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అభినందించారు. కాగా..ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీగా ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించిన తొలి వ్యక్తిగా అనిత గుర్తింపు పొందారు. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యతలతో వీసీ నియామకాన్ని ఏడాదిగా జాప్యం చేస్తూ వస్తున్న విషయం విదితమే.
విద్యార్థినికి
విషపురుగు కాటు
ఉరవకొండ: విష పురుగు కాటుతో విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన ఉరవకొండలో జరి గింది.వివరాలు.. స్థానిక ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ధనశ్రీ శనివారం పాఠశాలలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి కింద పడింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యా యులు ఏమైందని ఆరా తీయగా.. తనకు ఏదో కుట్టిందని చెప్పింది. దీంతో టీచర్లు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ధనశ్రీది వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండా గ్రామం కాగా, ఉరవకొండలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
బొమ్మనహాళ్: రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం బొమ్మనహాళ్ సమీపంలోని హెచ్చెల్సీలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, టీబీ డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్, ఆయకట్టు రైతులు గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ జిల్లాకు జీవనాడి అయిన తుంగభద్ర ఎగువ కాలువకు ఎప్పుడూ లేని విధంగా జూలై 20లోపే నీటిని తీసుకొచ్చి హారతి ఇచ్చామన్నారు. టీబీ డ్యాంలో ఈ ఏడాది కొత్త గేట్లు అమర్చబోతున్నారని, ఈ క్రమంలో నీరు ముందుగానే బంద్ అయ్యే అవకాశాలున్నాయన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ఆ మేరకు పంటలను సాగు చేసుకోవాలన్నారు. గత ఏడాది బచావత్ అవార్డు ప్రకారం నీటిని తీసుకొని చరిత్ర సృష్టించామన్నారు. తక్కువ సమయంలో హెచ్చెల్సీలో అత్యవసర మరమ్మతు పనులు చేయించామన్నారు. కార్యక్రమంలో హెచ్చెల్సీ డీఈఈ దివాకర్‌రెడ్డి, జేఈలు రంజిత్‌కుమార్, అల్తాఫ్, తుంగభద్ర పాజెక్టు వైస్ చైర్మన్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు ‘పరిష్కార వేదిక’

రేపు ‘పరిష్కార వేదిక’

రేపు ‘పరిష్కార వేదిక’