
ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలి
● కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
నార్పల: ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేశామని, ఇకపై గ్రామాల్లో కూడా అమలు చేస్తామని చెప్పారు. చెత్త ప్రాసెసింగ్‌పై దృష్టి పెడుతున్నామన్నారు. జిల్లాను స్వచ్ఛంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం రైతు రామాంజినేయులు గోకులం షెడ్ ప్రారంభించి, పశుపోషణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటి ఇంకుడు గుంతలకు,గ్రామ ప్రాథమిక పాఠశాలలో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. క్లాప్ మిత్రలు, సర్పంచును సన్మానించారు. ఇంటింటికీ క్లాత్ బ్యాగ్‌లు, చెత్త బుట్టలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.కోటిన్నర చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సర్పంచు ఆలం శిరీష, ఉప సర్పంచు ఆలం వెంకట నరసానాయుడు, డీపీఓ నాగరాజునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
● హిందూపురం పట్టణానికి చెందిన నరేష్ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని బోస్టన్ వర్సిటీలో ఎంఎస్ సీటు వచ్చింది. అయితే, అక్కడకు వెళ్లేందుకు వీసా స్లాట్ కేటాయించలేదు. దీంతో నరేష్ రోజూ కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు.
● అనంతపురం శారదానగర్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి కర్ణాటకలోని ఓ ప్రముఖ ఇంజినీ రింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇతనికి సీటు వచ్చింది. కానీ వీసా కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. వీరిద్దరే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతో మంది విద్యార్థులు ఇదే సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థుల ‘కల’ చెదిరింది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న కోరిక నెరవేరడం లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో ఎంఎస్ కోసం ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 800 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్టు ప్రాథమిక అంచనా. కానీ ఇప్పటివరకూ పట్టుమని 40 మందికి కూడా వీసాలు రాలేదని తెలుస్తోంది. వివిధ కన్సల్టెన్సీలు, ఎడ్యుకేషనల్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఏడాది పదుల సంఖ్యలోనే విద్యార్థులకు అవకాశం వచ్చినట్టు వెల్లడైంది. ఇంజినీరింగ్‌తో ఇక్కడ ఉద్యోగం రాక, అమెరికాలో ఎంఎస్ చదవడానికి అవకాశం లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పడరాని పాట్లు..
డొనాల్డ్ ట్రంప్ అమెరికగా అధ్యక్షుడయ్యాక విదేశీ విద్యార్థులకు నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో మన విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతోంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులకు మంచి యూనివర్సిటీల నుంచి ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించి ఐ–20 ఫాంలు వచ్చాయి. వీటి ఆధారంగానే వీసా ఇంటర్వ్యూకు వెళతారు. కానీ వీసా స్లాట్‌లు కేటాయించకపోవడంతో రేయింబవళ్లు ఎదురు చూస్తున్నారు. అమెరికాలో మెజారిటీ యూనివర్సిటీలు ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 20 లోపు తరగతులు ప్రారంభిస్తాయి. ఐ– 20 ఆధారంగా ఇప్పటికే బ్యాంకు లోన్లు మంజూరు చేశారు. వీసా ఇంటర్వ్యూ ఆమోదం లభిస్తే చాలు వెళ్లిపోవాలని ఆలోచన. కానీ వీసా స్లాట్‌లు లభించకపోవడంతో విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరడం లేదు. ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అవకాశాలున్నా రకరకాల కారణాలతో అక్కడకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
విదేశీ విద్యకు రాయితీ ఏదీ..?
గత ప్రభుత్వ హయాంలో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద 50 శాతం నుంచి 100 శాతం వరకూ ఫీజు రాయితీ పొందిన అభ్యర్థులున్నారు. వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్‌ను బట్టి రాయితీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు రాయితీలు తొలగించడంతో పేద విద్యార్థులు విదేశాల్లో చదివే అవకాశం కోల్పోతున్నారు.
గతంలో ఉమ్మడి జిల్లా నుంచి
300 మందికి పైగా విదేశాలకు..
ఈ ఏడాది వీసా కష్టాలతో
40 మందికి మించని వైనం
వీసా స్లాట్‌ల కోసం ఎదురుచూపులు
కొంతమందికి ఇప్పటికే
లోన్ల మంజూరు
మంచి యూనివర్సిటీల్లో సీటు వచ్చినా వీసా రాక పాట్లు

ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలి

ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలి